Krack Trailer - అదరగొడుతున్న రవితేజ

Saturday,January 02,2021 - 01:26 by Z_CLU

నిన్న విడుదలైన రవితేజ Krack ట్రైలర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పుతుంది. ముఖ్యంగా సినిమాలో ఉన్న మాస్ ఎలిమెంట్స్ ను ట్రైలర్ లో చూపించి ఎట్రాక్ట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ట్రైలర్ లో GK విష్ణు సినిమాటోగ్రఫీ , తమన్ నేపథ్య సంగీతంతో పాటు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్, సాయి మాధవ్ బుర్రా పవర్ ఫుల్ డైలాగ్స్ హైలైట్స్ గా నిలిచాయి.

వరుస అపజయాలతో సతమవుతున్న దర్శకుడు గోపీచంద్ మలినేని కసితో చేసిన సినిమా అనిపిస్తుంది. ఈ సినిమాతో గోపీచంద్ మలినేని మళ్ళీ ఒకప్పటి మాస్ మహారాజను స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది.

Krack Trailer కోసం క్లిక్ చేయండి

ప్రస్తుతం యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్టులో నిలుస్తూ 7 మిలియన్ వ్యూస్ సాదించి 10 మిలియన్ వ్యూస్ వైపు దూసుకు వెళ్తోంది క్రాక్ ట్రైలర్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Check- మాస్ రాజా కోసం వెంకీ మామ