సంక్రాంతి బరిలో Krack - రిలీజ్ డేట్ ఫిక్స్

Saturday,December 19,2020 - 04:07 by Z_CLU

సంక్రాంతికి రానున్న సినిమాలపై ఇంకా క్లారిటీ లేదు. ముందుగా ఎనౌన్స్ చేసిన సినిమాలు వస్తాయో రావో తెలియని పరిస్థితి. అయితే చెప్పినట్టే సంక్రాంతికి రానున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చాడు Krack డైరెక్టర్.

జనవరి 14న సినిమా థియేటర్స్ లోకి రానుందని ట్విట్టర్ ద్వారా గోపిచంద్ మలినేని ఎనౌన్స్ చేశాడు. దీంతో సంక్రాంతి బరిలో Mass Maharaja అంటూ రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

గతంలో రవితేజ నటించిన ‘కృష్ణ’ సినిమా.. సంక్రాంతికే వచ్చి సూపర్ హిట్టయింది. దీంతో క్రాక్ పై ఆ పాజిటివ్ సెంటిమెంట్ ఎఫెక్ట్ కూడా పడింది.

‘రంగ్ దే’, ‘అరణ్య’, ‘రెడ్’ సినిమాలు కూడా సంక్రాంతికే ఎనౌన్స్ చేశారు. కానీ వాటి నుంచి ఇంకా అఫీషియల్ డేట్స్ రాలేదు. సంక్రాంతి బరిలో డేట్ ఎనౌన్స్ చేసిన మొదటి సినిమా క్రాక్ మాత్రమే.