రవితేజ ‘క్రాక్’ ఫస్ట్ లుక్ రిలీజయింది

Wednesday,January 01,2020 - 02:32 by Z_CLU

రవితేజ, గోపీచంద్ మాలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘క్రాక్’ ఫస్ట్ లుక్ రిలీజయింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్.  అయితే అంచనా వేసినట్టుగానే పోలీస్ గెటప్ లో రవితేజ మాస్ లుక్ అదిరిందనిపిస్తుంది.

డాన్ శీను, బలుపు సినిమాల తరవాత ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో న్యాచురల్ గానే సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి తోసు వరలక్ష్మి శరత్ కుమార్, సముతిరఖని సినిమాలో కీ రోల్స్  ప్లే చేస్తున్నారు.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.