రవితేజ సరసన మరోసారి హీరోయిన్ గా కాజల్?

Sunday,September 17,2017 - 03:30 by Z_CLU

వీళ్లిద్దరూ కలిసి ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. రవితేజ-కాజల్ కాంబోలో వీర, సారొచ్చారు లాంటి సినిమాలొచ్చాయి. వీటిలో రవితేజ సరసన చేసిన వీర సినిమాలో పక్కా మాస్ గా కనిపిస్తే… సారొచ్చారు సినిమాలో క్లాస్ గా కనిపించింది కాజల్. ఇప్పుడీ బుట్టబొమ్మను మరోసారి తన సినిమాలోకి తీసుకోవాలని చూస్తున్నాడు మాస్ రాజా.

త్వరలోనే శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ఇప్పటికే ఈ దర్శకుడు, హీరో మధ్య స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులోకే హీరోయిన్ గా కాజల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న కాజల్.. మాస్ రాజా సినిమాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు

ప్రస్తుతం రవితేజ చేతిలో 2 సినిమాలున్నాయి. వీటిలో రాజా ది గ్రేట్ సినిమా మరో నెలరోజుల్లో ఓ కొలిక్కి రాబోతోంది. ఆ సినిమా పూర్తయిన వెంటనే వైట్ల సినిమాపై అఫీషియల్ గా ఓ ప్రకటన వస్తుంది.