Raviteja Ravanasura - సెట్స్ లో జాయిన్ అయిన మాస్ రాజా

Wednesday,February 02,2022 - 06:12 by Z_CLU

RaviTeja Joins Shoot Of Sudheer Varma’s Ravanasura Today

‘క్రాక్’ తర్వాత స్పీడు పెంచి సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ప్రస్తుతం  ‘ఖిలాడి’ , ‘రామారావు’ సినిమాలకు సంబంధించి షూట్ ఫినిష్ చేసి త్వరలోనే ఆ సినిమాలతో థియేటర్స్ లోకి రాబోతున్నాడు. ఇక ‘ధమాకా’ సినిమాను సగం వరకూ పూర్తి చేసిన రవితేజ తాజాగా ‘రావణాసుర’షూటింగ్ మొదలు పెట్టాడు. రవితేజ లేకుండా కొన్ని సీన్లు తీశారు యూనిట్. తాజాగా రవితేజ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చి జాయిన్ అయ్యాడు. హైదరాబాద్ లో ఆఫీస్ లొకేషన్ లో ప్రస్తుతం రవితేజ , ఫరియా అబ్దుల్లా మీద కొన్ని సీన్స్ తీస్తున్నారు. ఇది సెకెండ్ షెడ్యూల్.

ఈ సినిమాలో రవితేజ లాయర్ గా నటిస్తున్నాడు. ఇప్పటి వరకూ చూడని విధంగా రవితేజ క్యారెక్టర్ ఉంటుందని టీం చెప్తున్నారు. రామ్ గా సుశాంత్ క్రూషియాల్ రోల్ లో కనిపించనున్నాడు. అను ఇమ్మానుయెల్ , మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా , నక్ష నాగర్కర్ ,పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ రామేశ్వరన్ , భీమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

ప్రారంభం రోజే సినిమా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది సెప్టెంబర్ 30న సినిమా థియేటర్స్ లోకి రానుంది. అభిషేక్ పిక్చర్స్ బేనర్స్ పై అభిషేక్ నామ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ విస్సా కథ అందించాడు.