రణరంగం అసలు హీరో ఎవరు?

Wednesday,August 14,2019 - 10:15 by Z_CLU

కొన్ని కథలు ఒక హీరో కోసం రెడీ అయి మరో హీరో దగ్గరికి వెళ్ళడం సహజమే. టాలీవుడ్ లో ఇలాంటి సినిమాలెన్నో. శర్వానంద్ నటించిన ‘రణరంగం’ కూడా అలాంటిదే.  ముందుగా ఈ సినిమాను రవితేజతో చేయలనుకున్నాడట సుధీర్ వర్మ. అనుకోకుండా శర్వాతో చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు.

“ఈ కథను ముందుగా రవితేజ గారికి చెప్పాను. ఆయనకి కథ బాగా నచ్చింది. కానీ ఆ టైంలో రవితేజ 2 సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన కోసం కథను పక్కన పెట్టాను. అయితే శర్వా కి ఓ సందర్భంలో ఊరికే ఈ  కథ వినిపించాను. కథ వినగానే శర్వా ఇలాంటి ఛాలెంజింగ్ సినిమా చేయాలనుందని, రవితేజ గారిని కన్విన్స్ చేయమని అడిగాడు. వెంటనే రవితేజ గారిని విషయం చెప్పి ఆయన సరే అన్నాక శర్వాకి లుక్ టెస్ట్ చేసి సినిమా మొదలుపెట్టాం.”