రవితేజ మల్టీస్టారర్ సినిమాకి రెడీ

Wednesday,January 31,2018 - 04:17 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్నాడు మాస్ మహారాజ్ రవితేజ. రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్టయిన ‘రాజా ది గ్రేట్’ తరవాత ‘టచ్ చేసి చూడు’ సినిమాతో రెడీ అయిన రవితేజ ఫాస్ట్ పేజ్ లో కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే రీసెంట్ గా ‘టచ్ చేసి చూడు’ ప్రమోషన్ ప్రాసెస్ లో మీడియాతో మాట్లాడిన రవితేజ మల్టీస్టారర్ చేయడానికి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

మంచి స్టోరీ ఉండాలి కానీ ఏ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికైనా రెడీ అని చెప్పిన రవితేజ, యంగ్ డైరెక్టర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో ఇండస్ట్రీలో రివొల్యూషణ్ తీసుకు వస్తున్నారని, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కంప్లీట్ గా మారబోతున్నాయని కాన్ఫిడెంట్ గా చెప్పాడు.

 

ప్రస్తుతం యాక్టర్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పిన మాస్ మహారాజ్, తన సొంత డైరెక్షన్ లో సినిమా తప్పకుండా ఉంటుందని, కాకపోతే దానికి ఇంకా టైముందని, క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో నటిస్తున్న రవితేజ, త్వరలో శ్రీను వైట్ల సినిమాతో సెట్స్ పైకి రానున్నాడు.