రవితేజ ఇంటర్వ్యూ

Tuesday,January 30,2018 - 08:15 by Z_CLU

రవితేజ ‘టచ్ చేసి చూడు’ ఫిబ్రవరి 2 న రిలీజవుతుంది. అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా గురించి మీడియాతో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు రవితేజ. ఆ విషయాలు మీ కోసం… 

అదే సినిమాలో బెస్ట్…

గతంలో కూడా పోలీసాఫీసర్ లా కనిపించాను కానీ అవి టోటల్ గా సీరియస్ క్యారెక్టర్స్. ఇక్కడ కూడా సీరియస్, డ్యూటీ మైండెడ్ పోలీసాఫీసరే కాకపోతే క్యారెక్టర్ కాస్త సర్కాస్టిక్ గా ఉంటుంది. ఈ సినిమాలో అదే బెస్ట్ పార్ట్.

 

నా ఫీలింగ్ అదే…

విక్రమ్ నా దగ్గరికి వేరే కథతో వచ్చాడు. అంతలో వక్కంతం వంశీ కథ తో చేద్దామని బుజ్జి విక్రమ్ కి చెప్పడం, ఆ తరవాత నేను ఇన్వాల్వ్ అవ్వడం మొత్తానికి వక్కంతం వంశీ కథని, విక్రమ్ తన స్టైల్ లో చాలా బాగా తెరకెక్కించాడు అని నా ఫీలింగ్.

చాలా ఎంజాయ్ చేశా…

సినిమా మొత్తం తెరకెక్కాక కాదు, సినిమా సెట్ మీదికి వచ్చినప్పటి నుండి కంప్లీట్ ప్రాసెస్ ఎంజాయ్ చేశా. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే టెన్షన్ పడతాం కానీ, కంప్లీట్ క్లారిటీతో సినిమా చేశాం. నేనైతే చాలా ఎంజాయ్ చేశా.

ఆ క్యారెక్టర్ అలాంటిది…

ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ చాలా బావుంటాయి. రాశిఖన్నా క్యారెక్టర్ కూడా సర్కాస్తిక్ గా, కామెడీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా నటించింది.

ఏజ్ ఈజ్ ఎ జస్ట్ నంబర్…

హ్యాప్పీగా ఉంటే చాలు అందరు యంగ్ గానే కనిపిస్తారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్…

మ్యూజిక్ అదిరింది…

ప్రీతమ్ చక్రవర్తి గారి జామ్ 8 టీమ్ అదిరిపోయే మ్యూజిక్ కంపోజ్ చేశారు. దానికి తోడు మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతీది పర్ఫెక్ట్ గా ఉంటుంది.

చాలెంజ్ అనుకుంటే వర్కవుట్ కావట్లేదు…

చాలెంజింగ్ గా తీసుకుని మంచి సినిమాలు చేస్తే కమర్షియల్ గా సక్సెస్ అవ్వట్లేదు. అందుకే ప్రస్తుతం నా కంప్లీట్ ఫోకస్ ఎంటర్ టైన్ మెంట్ పైనే ఉంది. ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తుంది.

ఎవరి స్టైల్ వారికుంటుంది….

హ్యూమర్ విషయంలో ఎవరి స్టైల్ వారికుంటుంది. ప్రతి డైరెక్టర్ కి ఓ స్టైల్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అది ఉంటేనే సినిమాలు వర్కవుట్ అవుతాయి.

ఆటోగ్రాఫ్ లాంటి సినిమా మళ్ళీ….

తప్పకుండా చేస్తా… అలాంటి స్క్రిప్ట్స్ ఆల్ రెడీ ఉన్నాయి. రైట్ టైమ్ చూసుకుని డెఫ్ఫినేట్ గా చేస్తా…

అక్కడికి వెళ్తే అర్థమయిపోయింది

మొన్న బర్మాకి వెళ్తే అక్కడ రియాక్షన్ మామూలుగా లేదు. మన సినిమాలు డబ్బింగ్ అవుతుండటం వల్ల, మంచి  గుర్తింపు వస్తుంది. అక్కడ వాళ్ళ రియాక్షన్ చూసి షాక్ అయ్యా… అంత వీవర్ షిప్ ఉందా అనిపించింది. అవకాశం రావాలే కానీ హిందీ సినిమా తప్పకుండా చేస్తా…

 

నేను బ్రేక్ తీసుకోలేదు…

నేనసలు బ్రేక్ తీసుకోలేదు. టైమ్ కి స్క్రిప్ట్స్ కుదరలేదంతే. ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తున్నానంటే అలా అన్ని కలిసొస్తున్నాయి. అయినా గ్యాప్ రావడం వల్ల మంచే జరిగింది. చాలా ప్లేసెస్ తిరిగాను. ఎంజాయ్ చేశాను. గ్యాప్ వచ్చినందుకు బాధ లేదు.

పూరి జగన్నాథ్ తో సినిమా…

పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ ఇయర్ పాసిబుల్ కాకపోవచ్చు కానీ, కంపల్సరీగా మా కాంబినేషన్ లో సినిమా ఉంటుంది.

నెక్స్ట్ సినిమాలు…

సెట్స్ పై ఉన్న కళ్యాణ్ కృష్ణ సినిమా 25% కంప్లీట్ అయింది. దాని తరవాత శ్రీనువైట్లతో సినిమా ఉంటుంది.

గ్రేట్ రివొల్యూషణ్….

యంగ్ డైరెక్టర్స్ చాలా క్లారిటీతో వస్తున్నారు. స్పీడ్ గా ఉంటున్నారు. ఇంకో 2, 3 ఇయర్స్ లో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కంప్లీట్ గా మారిపోతాయి. ఈ విషయంలో  నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను.

మల్టీస్టారర్…

మల్టీ స్టారర్ సినిమా గురించి డైరెక్టర్స్, రైటర్స్ ఆలోచించాలి. నేను కాదు. మంచి కథ ఉండాలే కానీ ఎవరితో చేయడానికైనా నేను రెడీ….

సొంత డైరెక్షన్….

నా డైరెక్షన్ లో సినిమా కంపల్సరీగా ఉంటుంది కానీ ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. ప్రస్తుతానికి నేనేం చేస్తున్నానో అది చాలా బావుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఫ్యూచర్ లో డైరెక్షన్ చేస్తాను. కానీ ఆ సినిమాలో నేను నటించను. అది మాత్రం ష్యూర్.

సినిమా అనేది బాధ్యత…

ఒక సినిమాకి ఓకె చెప్పేముందు జస్ట్ నా క్యారెక్టర్ పై ఫోకస్ చేయను. ప్రతీది ఆలోచిస్తాను. చిన్న క్యారెక్టర్ దగ్గర్నించి ప్రతీది వర్కవుట్ అవుతుందనిపిస్తేనే  చేస్తాను. ఎందుకంటే సినిమా  అనేది  బాధ్యత…

ప్లాన్స్ వర్కవుట్ కావు…

నేనేదీ ప్లాన్ చేయను.  జస్ట్ ఫ్లో తో వెళ్ళిపోతుంటాను. ప్లాన్ చేస్తే ఏదీ వర్కవుట్ అవ్వదు.