రవితేజ ఇంటర్వ్యూ
Tuesday,May 22,2018 - 02:28 by Z_CLU
ఈ నెల 25 న గ్రాండ్ గా రిలీజవుతుంది మాస్ మహారాజ ‘నేలటిక్కెట్టు ’. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. సినిమా సక్సెస్ గ్యారంటీ కాన్ఫిడెంట్ గా ఉన్న రవితేజ, ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడాడు. ఆ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీకోసం…
సినిమా చూస్తే తెలుస్తుంది…
సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టాం అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది…
బాల్కనీ ఆడియెన్స్ కూడా…
జస్ట్ ‘ నేలటిక్కెట్టు ’ ఆడియెన్సే కాదు, బాల్కనీ ఆడియెన్స్ కూడా విజిల్స్ కొడతారు… అలా ఉంటుంది సినిమాలో కంటెంట్…

మాస్ అప్పీల్ కోసం కాదు…
మాస్ అప్పీల్ కోసం పెట్టుకున్న టైటిల్ కాదిది.. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ రిఫ్లెక్ట్ అయ్యే టైటిల్ అది. వాడి చుట్టూ ఉన్నవాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళే పర్సనాలిటీ హీరోది.
ట్రీట్మెంట్ డిఫెరెంట్ గా ఉంటుంది..
సినిమాలో కొంచెం రివేంజ్ డ్రామా కూడా ఉంటుంది.. కానీ కంప్లీట్ గా కళ్యాణ్ కృష్ణ మార్క్ ఎలివేట్ అవుతుంది. కథ మరీ కొత్తది కాకపోయినా ప్రతి క్యారెక్టర్ ని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేశాడు. సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ కూడా చాలా బావుంటుంది.
అదే బిగ్గెస్ట్ ఇమోషన్…
సొంత మనుషులు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఒకడు అందరినీ తన వాళ్ళలా ఫీలవ్వడం… తపించడం అనేది సినిమాలో చాలా పెద్ద ఇమోషన్.. ఈ పాయింట్ చుట్టే సినిమా తిరుగుతూ ఉంటుంది…

అదొక్కటే కాదు…
ట్రైలర్ లో సీనియర్ సిటిజన్ కి సంబంధించిన డైలాగ్ చాలామందికి నచ్చేసింది.. అలాంటి ఎలిమెంట్స్ సినిమాలో చాలా ఉంటాయి.. పేరెంట్స్ ని పట్టించుకోని వాళ్ళు ఎందుకు బ్రతుకుతారో కూడా నాకర్థం కాదు…
ఈ సినిమా నా వల్లే లేటయింది…
‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా కన్నా ముందే కళ్యాణ్ కృష్ణ ఈ స్టోరీ నాకు చెప్పాడు. కాకపోతే అప్పటికే నాకు వేరే కమిట్ మెంట్స్ ఉండటంతో, అప్పట్లో కుదరలేదు. ఈ లోపు కళ్యాన్ 2 సినిమాలు చేసేసుకున్నాడు… మా కాంబినేషన్ లో ఇప్పుడు కుదిరింది…
రామ్ తాళ్ళూరిలో నాకు నచ్చిన పాయింట్…
రామ్ తాళ్లూరి గారి ప్రొడక్షన్ లో ఇంకో సినిమా కూడా చేస్తున్నాను. ఆయన చాలా ప్రాక్టికల్ మనిషి. పైకి ఒకలా.. బయట ఇంకోలా అస్సలు ఉండడు. అక్కడే మా ఇద్దరికీ సింక్ అయింది. చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్…
అనూ ఇమ్మాన్యువెల్…
డేట్స్ కుదరకే సినిమా నుండి తప్పుకుంది… అటు నాగా చైతన్య సినిమాలోను భారీ షెడ్యూల్స్ ఉన్నాయి.. ఇక్కడ సినిమాది అదే పరిస్థితి… మ్యాగ్జిమం అర్జెస్ట్ చేసినా కుదరలేదు.. కానీ నెక్స్ట్ సినిమాలో అనూ తప్పకుండా ఉంటుంది నా సినిమాలో…

సాంగ్స్ చాలా బావున్నాయి…
శక్తికాంత్ మ్యూజిక్ నాకు చాలా నచ్చేసింది. ‘ఫిదా’ సినిమా సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకు కూడా చాలా మంచి సాంగ్స్ కంపోజ్ చేశాడు…
చాలా మారిపోయింది…
సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘తేరి’ రీమేకే అయినప్పటికీ , స్క్రిప్ట్ లో దాదాపు 70% వరకు చేంజెస్ చేశాం. కొత్తదనం ఆడ్ అవుతూనే సోల్ ఫుల్ గా ఉంటుంది.