#Raviteja - నెక్స్ట్ సినిమా అదేనా?

Saturday,September 25,2021 - 10:44 by Z_CLU

ప్రస్తుతం ‘ఖిలాడీ’, ‘రామారావు’ సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ ఓ భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అవును నెక్స్ట్ టైగర్ నాగేశ్వరావు బయో పిక్ తో సినిమా చేయబోతున్నాడు రవితేజ. స్టువర్ట్ పురం గజ దొంగ టైగర్ నాగేశ్వరావు కథతో దర్శకుడు వంశీ కృష్ణ ఎప్పుడో ఓ కథను సిద్దం చేసుకొని కొందరు హీరోలకు చెప్పాడు. రానా తో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ సెట్ అయింది. కానీ ఎందుకో డ్రాప్ అయ్యారు.

ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ రవితేజ చేతిలోకి వెళ్ళింది. ఇప్పటికే వంశీ కృష్ణ మాస్ మహారాజా కి పూర్తి నెరేషన్ ఇచ్చేశాడు. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు అంటే చాలా మందికి తెలియదు. అతని జీవితంలో మంచి సంఘటనలు ఉన్నాయి. అవన్నీ స్క్రీన్ పై సినిమాగా చూపించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఈ వారంలోనో లేదా వచ్చే వారంలో ప్రకటన కూడా రానుంది. టైటిల్ తో పాటు సినిమాను ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.

‘రామారావు’ సినిమా తర్వాత రవితేజ త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ లో సినిమా చేయాల్సి ఉంది. మరి ఆ సినిమాతో పాటే ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ని కూడా సెట్స్ పై పెడతాడా? లేదా రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా గురించి మిగతా డీటెయిల్స్ తెలియనున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics