కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ

Saturday,November 25,2017 - 11:20 by Z_CLU

రాజా ది గ్రేట్ సక్సెస్ తో ఊపుమీదున్న రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం టచ్ చేసి చూడు మూవీని ఓ కొలిక్కి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్న మాస్ రాజా.. త్వరలోనే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడని టాక్.

నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయనా, నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు చేశాడు కల్యాణ్ కృష్ణ. ఆ రెండు సినిమాల తర్వాత తన మూడో ప్రయత్నంగా రవితేజకు ఓ స్టోరీలైన్ వినిపించాడు. ఆ కథ నచ్చిన మాస్ రాజా వెంటనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది.