జీ ఎక్స్ క్లూజివ్: మహాసముద్రంలో మాస్ రాజా

Thursday,June 06,2019 - 05:12 by Z_CLU

ఆర్ఎక్స్100 తర్వాత మహాసముద్రం అనే స్టోరీ రెడీ చేసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమాను మొదట నాగచైతన్యతో ప్లాన్ చేశాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడీ సినిమాకు హీరో ఫిక్స్ అయ్యాడు. రవితేజ హీరోగా మహాసముద్రం ప్రాజెక్టు సెట్స్ పైకి రాబోతోంది.

రీసెంట్ గా అజయ్ భూపతి, రవితేజ మధ్య స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయి. డిస్కోరాజా తర్వాత సెట్స్ పైకి వచ్చేది ఈ సినిమానే. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.

మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. మూవీకి సంబంధించి ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. కంపోజర్ చైతన్ భరధ్వాజ్ ఈ సినిమా కోసం ఇప్పటికే 2 పాటలిచ్చాడు. హీరోయిన్ ను ఇంకా ఫైనలైజ్ చేయలేదు.

ఓ మంచి రోజు చూసి ప్రాజెక్టును అపీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు. అజయ్ భూపతి నుంచి ఆర్ఎక్స్100 తర్వాత వస్తున్న సినిమా కావడంతో మూవీపై అంచనాలున్నాయి.