రవితేజని ఇంప్రెస్ చేసిన సినిమా ట్రైలర్

Tuesday,June 12,2018 - 01:17 by Z_CLU

మాస్ మహారాజ్ చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజయింది ‘జంబలకిడి పంబ’ ట్రైలర్. అయితే ఈ ట్రైలర్ చూసిన రవితేజ, సినిమా రిలీజ్ కి ముందే సూపర్ హిట్ గ్యారంటీ అని సర్టిఫికెట్ ఇచ్చేశాడు. “టైటిల్ ఒక్కటే పాతది, మిగతా కథంతా కొత్తగా, అద్భుతంగా రాసుకున్నారు” అని చెప్పివ రవితేజ ఈ సినిమా శ్రీనివాస రెడ్డి కరియర్ లో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచితుందని కూడా చెప్పాడు.

ఆడ మగగా, మగ ఆడగా మారడం ‘జంబలకిడి పంబ’ కథైతే, అలా మారాక ఇద్దరు పడే అవస్థలే సినిమాలో హిలేరియస్ ఎలిమెంట్స్ కానున్నాయి. దానికి తోడు వెన్నెల కిషోర్ సినిమాలో క్రియేట్ అయ్యే కాంఫ్లిక్ట్ కి బ్యాక్ బోన్ అని తెలుస్తుంది. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా, సూపర్ హిట్ గ్యారంటీ అని రవితేజ కూడా చెప్పడంతో, న్యాచురల్ గానే ఈ సినిమా చుట్టూ మరింత క్యూరియాసిటీ రేజ్ అవుతుంది.

జూన్ 22 గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళీ మరో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్నాడు. గోపీసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా J.B. మురళీ కృష్ణ దర్శకుడు. రవి, జోజో జోన్, శ్రీనివాస రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.