Raviteja Ravanasura - మాస్ రాజా మరో ప్రయోగం?

Friday,January 21,2022 - 03:27 by Z_CLU

Raviteja experiments with Ravanasura Movie

‘క్రాక్’ తర్వాత మాస్ మహారాజ్ జెట్ స్పీడులో సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. కొత్త తరహా కథలు , డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అయితే వాటిలో ‘రావణాసుర’ మాత్రం మరింత విభిన్నంగా ఉండనుందని తెలుస్తుంది. ఇది చాలా కొత్త కథ అని రవితేజ పాత్ర కూడా ఇప్పటివరకూ చూడని విధంగా ఉంటుందని యూనిట్ చెప్తున్నారు. ఈ సినిమా రవితేజకి నటుడిగా మరో ఛాలెంజ్ అంటూ చెప్తున్నారు కూడా. ఫర్ ది ఫస్ట్ టైం రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడని టాక్ వినబడుతుంది. సినిమాలో న్యాయవాదిగా కనిపించబోతున్నాడు రవితేజ.

యంగ్ డైరెక్టర్ సుదీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా కథ అందిస్తున్నాడు. శ్రీకాంత్ సుకుమార్ శిష్యుడు. తాజాగా పుష్ప సినిమాకు మాటలు అందించాడు. ఆ సినిమా ఈవెంట్ లో శ్రీకాంత్ గురించి సుక్కు ఎంతో గొప్పగా చెప్పాడు కూడా. చాలా గొప్ప రచయిత అంటూ కితాబిచ్చాడు. సుకుమార్ ఆలోచనలు కథల ఎంపిక చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దీంతో సుక్కు శిష్యుడు ఇప్పుడు రావణాసుర సినిమాకు ఓ కొత్త కథ రాసి ఉంటాడని టాక్ వినబడుతుంది.

తాజాగా సినిమాను చాలా గ్రాండియర్ గా లాంచ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవితో క్లాప్ కొట్టించారు. ఈ మధ్య కాలంలో రవితేజ సినిమాకు ఈ రేంజ్ లో ఓపెనింగ్ జరగలేదు.  రవితేజ కి, అలాగే టీంకి సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోనే ఈ సినిమాను భారీ స్థాయిలో లాంచ్ చేశారని అనుకోవచ్చు. ఏదేమైనా ఈ సినిమాతో మాస్ మహారాజా ఏదో ఒక ఎక్స్ పెరిమెంట్ చేయబోతున్నాడని అర్థమవుతుంది. ఇక సినిమాను తన మేకింగ్ తో మంచి టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కించడంతో సుదీర్ వర్మ దిట్ట. ఈ ప్రాజెక్ట్ అతనికి కూడా ఛాలెంజే.

రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ రామ్ అనే ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అను ఇమ్మనుయెల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్,  మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహత (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు.