Raviteja - ఒకేసారి రెండు

Saturday,November 28,2020 - 04:03 by Z_CLU

Raviteja 3 Movies: ప్రస్తుతం మాస్ మహారాజా Raviteja చేతిలో 3 సినిమాలున్నాయి. ఇటివలే Krack సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసిన రవితేజ, నెక్స్ట్ రవివర్మ దర్శకత్వంలో చేయబోతున్న Kiladi ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. వచ్చే నెల నుండి షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి లైన్లో ఉన్న రెండు సినిమాలను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

‘కిలాడీ’ తర్వాత Maruthi దర్శకత్వంలో ఓ సినిమా అలాగే త్రినాధరావు నక్కినతో మరో సినిమా చేయబోతున్న మాస్ మహారాజా ఈ రెండు సినిమాలను ఒకేసారి మొదలుపెట్టి ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడట.

రెండు సినిమాల్లో గెటప్ పరంగా పెద్దగా మార్పులు ఉండవని అందుకే రవితేజ ఇలా డిసైడ్ అయ్యాడని టాక్. ప్రసన్న కుమార్ కథతో త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా రవితేజ-మారుతి కాంబోను సినిమాను గీతా ఆర్ట్స్ 2, UV క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తాయని టాక్.

Also Check – ఖిలాడీ రవితేజ