గోవాలో డిస్కోరాజా...

Thursday,September 12,2019 - 11:59 by Z_CLU

డిస్కోరాజా.. రవితేజ 2 డిఫెరెంట్ రోల్స్ లో కనిపించనున్న సినిమా. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన కీ సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్న Vi ఆనంద్ టీమ్, గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది.

వారం రోజుల పాటు ఉండబోబోతున్న ఈ షెడ్యూల్ లో మోస్ట్ ఇంటెన్సివ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కిస్తున్నారు మేకర్స్. తన కరియర్ లోనే ఫస్ట్ టైమ్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్నాడు మాస్ మహారాజ్. డిఫెరెంట్ కాన్సెప్ట్స్ ని ఆవిష్కరించే Vi ఆనంద్, రవితేజని స్క్రీన్ పై ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడోనన్న క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.

నభా నతేష్, పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో రవితేజ సరసన నటిస్తున్నారు. SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి రామ్ తాళ్ళూరి నిర్మాత. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. డిసెంబర్ 20 న సినిమా రిలీజవుతుంది.