మళ్ళీ రెండు సినిమాలు ..రవితేజ ఫుల్ బిజీ

Saturday,May 19,2018 - 03:50 by Z_CLU

యంగ్ హీరోలు సైతం ఒక సినిమా  తర్వాతే మరో సినిమా చేస్తుంటే మాస్ మాహరాజ్ మాత్రం ప్రతీ సారి రెండు సినిమాలతో దూసుకెల్తున్నాడు. ఇటివలే ‘నేల టిక్కెట్టు’ సినిమాకు సంబంధించి షూటింగ్ ఫినిష్ చేసేసిన రవితేజ ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీ అయిపోయాడు.

ప్రస్తుతం శ్రీను వైట్ల తో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటిస్తున్న రవితేజ మరో వైపు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ‘తేరి’ రిమేక్ గా తెరకెక్కుతున్న సినిమాను కూడా  సెట్స్ పై పెట్టేసాడు. ఈ రెండు సినిమాలను సైమల్టీయస్ గా ఫినిష్ చేసి ఆ తర్వాత వి.ఐ ఆనంద్ తో ఓ సినిమా అలాగే మరో డైరెక్టర్ తో ఓ సినిమా చేసే ప్లాన్ చేసుకుంటున్నాడు.