రవితేజ బర్త్ డే స్పెషల్

Friday,January 26,2018 - 10:07 by Z_CLU

ఫ్యాన్స్ కి మాస్ మహారాజ్, ప్రొడ్యూసర్స్ కి ఫుల్ టూ పైసా వసూల్ హీరో, స్క్రీన్ పై తన లైవ్లీ పర్ఫామెన్స్ తో ఎనర్జిటిక్ గా కనిపించే రవితేజతో పని చేయాలంటే ప్రతి డైరెక్టర్ కి డ్రీమ కమ్ ట్రూ ఎలిమెంట్. అలాంటి రవితేజ ఈ రోజు  తన 50 వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా జీ సినిమాలు స్పెషల్ స్టోరీ…

సినిమాపై అభిమానంతో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రవితేజ కరియర్ కేక్ వాక్  లా బిగినింగ్ కాలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కరియర్ బిగిన్ చేసిన రవితేజ, చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటిస్తూ, తన పర్ఫామెన్స్ ఎబిలిటీస్ తో ఎప్పటికప్పుడూ మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. అలా కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన  సెన్సేషనల్ హిట్ ‘సింధూరం’ చాన్స్ కొట్టేశాడు రవితేజ. 1997 లో రిలీజైన ఈ సినిమా రవితేజ లోని బెస్ట్ ఆంగిల్ ని ప్రెజెంట్ చేసింది.

‘సింధూరం’ తరవాత అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రవితేజ వరసగా సీతారామ రాజు, పాడుతా తీయగా, మనసిచ్చి చూడు, ప్రేమకు వేళాయెరా లాంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నాడు. అయితే  1999 లో శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ‘నీ కోసం’ సినిమా రవితేజ కరియర్ కి ఒకసారిగా పాజిటివ్ స్ట్రోక్ ని ఇచ్చింది. మొత్తానికి ఈ కుర్రాడు ఫుల్ టైమ్ హీరోగా కూడా పనికొస్తాడు అనే ఇంప్రెషన్ ని ఫిలిమ్ మేకర్స్ మైండ్ లో ఫిక్స్ చేసిందీ సినిమా. ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నాడు రవితేజ.

రవితేజ కరియర్ లో 2001 – 2010 గోల్డెన్ పీరియడ్ అనే చెప్పాలి. ఈ దశకం బిగినింగ్ లోనే రిలీజయింది పూరి ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం.  అ తరవాత వచ్చిన ‘అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’, ‘ఇడియట్’ ,‘ఖడ్గం’ ‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’, బ్యాక్ టు బ్యాక్ రిలీజైన ఈ సినిమాలు రవితేజ ని బిగ్గెస్ట్ కమర్షియల్ హీరో పక్కన నిలబెట్టేశాయి.

2006 లో రిలీజైన ‘విక్రమార్కుడు’ రవితేజ కరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ మహారాజ్ కరియర్ లో బెస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసుకుంది.

కామెడీ, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ మెయిన్ ప్లాట్ ఫామ్ గా సినిమాను ప్లాన్ చేసుకునే రవితేజ కరియర్ లో ‘కిక్’ సినిమాకి కూడా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. రవితేజలో ఇంకా ఇన్ని హిడెన్ ఎంటర్ టైనింగ్ ఆంగిల్స్ ఉన్నాయా అనిపించిందీ సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే రవితేజ చేసిన ప్రతి సినిమాలో తనను తాను డిఫెరెంట్ గా  ప్రెజెంట్  చేస్తూ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు.

రీసెంట్ గా రిలీజైన ‘రాజ ది గ్రేట్’ సినిమాతో ఫుల్ ఫామ్ లో ఉన్న రవితేజ ప్రస్తుతం విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘టచ్ చేసి చూడు’ సినిమాతో మరింత ఎంటర్ టైన్ చేయనున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో కరియర్ ని ప్లాన్ చేసుకున్న మాస్ మహారాజ్ ఇంకెన్నో  హైట్స్ కి రీచ్ అవ్వాలని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో  జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.