రవితేజ – సమంతాలిద్దరూ ఒకేలా...

Friday,May 24,2019 - 12:04 by Z_CLU

కథలు వేరు… అసలు ఒకరు చేస్తున్న సినిమాకి ఇంకొకరు చేస్తున్న సినిమాకి సంబంధం లేదు. కానీ సమంతా, రవితేజలు ప్లే చేస్తున్న క్యారెక్టర్స్ మాత్రం ఆల్మోస్ట్ ఒకేలా ఉండబోతున్నాయి. సమాంత ‘ఓ బేబీ’ ని రవితేజ ‘డిస్కోరాజా’ ని గమనిస్తే ఇద్దరు ప్లే చేస్తున్న క్యారెక్టర్స్ లో చిన్న సిమిలారిటీ కనిపిస్తుంది.

సమంతా నటిస్తున్న ‘ఓ బేబీ’ లో సమంతా శరీరంలోకి ముసలావిడ ఆత్మ స్వాప్ అవుతుంది. అంటే చూడ్డానికి యంగ్ అమ్మాయిలా కనిపిస్తున్నా, చేసే పనులన్నీ ముసలావిడ చేసే పనుల్లా ఉంటాయి. దానికి తోడు నందిని రెడ్డి మార్క్ హిలేరియస్ ఎలిమెంట్స్ తో ఈ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది.

ఇకపోతే రవితేజ ‘డిస్కోరాజా’ లో కూడా ఆల్మోస్ట్ ఇంతే. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ మధ్య ఒక ముసలి వ్యక్తి సడెన్ గా కొన్ని రోజులు కనబడకుండా పోతాడు. ఆ తరవాత యంగ్ మ్యాన్ గా తిరిగివస్తాడు. అంటే ఆల్మోస్ట్ అంతే యంగ్ రవితేజ బాడీలోకి ఓల్డ్ మ్యాన్ అన్నమాట…

 

సందర్భం వచ్చింది కాబట్టి మెన్షన్ చేయడం తప్పితే నిజానికి ఈ 2 సినిమాల్లో దేనికీ ఒకదానికొకటి అస్సలు సంబంధం లేదు. సమంతా ‘ఓ బేబీ’ కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. రవితేజ ‘డిస్కోరాజా’ సైన్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.