జెన్నీఫర్ లోపెజ్ మ్యాన్షన్ లో మాస్ మహారాజ్

Thursday,April 05,2018 - 11:02 by Z_CLU

ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్  అమెరికాలో జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా యూనిట్, వరల్డ్ వైడ్ గా మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ కి హార్ట్ త్రోబ్ అయిన ఎవర్ గ్రీన్ పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్ పలాటిటల్ మ్యాన్షన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు శ్రీనువైట్ల స్వయంగా ట్వీట్ చేయడంతో, సోషల్ మీడియాలో ఈ సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది.

1700 స్క్వేర్ ఫీట్ లో, 12.5 మిలియన్ డాలర్ల విలువ గల సోఫిస్టికేటెడ్ ఇంటీరియర్స్ ఉన్న విలువైన సెలెబ్రిటీ హోమ్ అది. ఈ మ్యాన్షన్ లో షూటింగ్ జరుపుకుంటున్న మొట్ట మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం.  న్యూయార్క్, కాలిఫోర్నియా, డెట్రాయిట్, సాల్ట్ లేక్ లాంటి ఎగ్జోటిక్ లొకేషన్ల తరవాత, సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఈ మ్యాన్షన్ లో తెరకెక్కిస్తుంది సినిమా యూనిట్.

 

రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు, శ్రీనువైట్ల ఒరిజినల్ హిలేరియస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. దానికి తగ్గట్టు అల్టిమేట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో విజువల్ ట్రీట్ లా ఈ  సినిమాను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తుంది. లయ మరో ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.