Krack - అందరికీ థ్యాంక్స్ చెప్పిన రవితేజ

Friday,January 08,2021 - 12:10 by Z_CLU

క్రాక్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. హీరో రవితేజ అందరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పాడు. సినిమా కచ్చితంగా హిట్టవుతుందంటూ కాన్ఫిడెంట్ గా కనిపించాడు మాస్ మహారాజ్.

* తమన్ ది బెస్ట్
హిట్, ప్లాప్ లకు సంభందం లేకుండా థమన్ నాకు ఎప్పుడూ మంచి మ్యూజిక్ ఇస్తాడు. అలాగే ఈ చిత్రానికి ఎక్స్ ట్రార్డినరి మ్యూజిక్ చేసాడు. రామజోగయ్య శాస్త్రి మూడు పాటలు రాయగా, కాసర్ల శ్యామ్ ఒక సాంగ్ రాసాడు. పాటలకు బ్రహ్మాండమైన ఫీడ్ బ్యాక్ వస్తుంది.

krack-pre-release

* కెమెరా వర్క్ సూపర్
నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ‘శంభో శివ శంభో’ ఒకటి. సముద్రఖని గారు మంచి రైటర్.. దర్శకుడు. ఈ చిత్రంలో ఆయన విలన్ క్యారెక్టర్ చేశారు. బుర్రా సాయి మాధవ్ మంచి పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు. ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైమ్. తెరవెనుక హీరోలు జి.కె. విష్ణు కెమెరా విజువల్స్ బ్యూటిఫుల్ గా ఇచ్చాడు. లైటింగ్, ఫ్రేమ్స్ పెట్టె విధానం చాలా బాగుంది. ఆయనతో వర్క్ చేయడం వెరీ హ్యాపీ.

krack-pre-release

* అలీతో చేస్తే హిట్టే
రామ్ లక్ష్మణ్ లు నా సినిమాలకి ఎప్పుడూ ఫైట్స్ బాగా కంపోజ్ చేస్తారు. సినిమా సినిమా కి వాళ్ళు బాగా ఎదుగుతూ అప్డేటెడ్ గా వుంటారు. వందశాతం పొజిటివ్ నెస్ తో వుంటారు. శృతిహాసన్ తో ఇది రెండవ సినిమా. తను చాలా చాలా బాగా చేసింది. ఆలీతో చేసిన అన్నీ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. మళ్ళీ ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో నటించారు.

krack-pre-release

* సక్సెస్ మీట్ లో కలుద్దాం
గోపీచంద్ మలినేని చాలా కష్టపడి ఈ సినిమా తీశాడు. సక్సెస్ మీట్ లో కలుద్దాం అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. మా ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న “క్రాక్” హ్యాట్రిక్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మధు, అమ్మిరాజులకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి బాగా డబ్బులు తెచ్చిపెట్టాలి..