Raviteja Movie - ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్

Saturday,December 12,2020 - 11:20 by Z_CLU

మాస్ మహారాజా Raviteja అప్ కమింగ్ సినిమా కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసారు. అవును రవితేజ Krack సినిమాలో ఓ ఎనర్జిటిక్ సాంగ్ కంపోజ్ చేసాడు తమన్. ఈ సాంగ్ ను ఎవరైనా యంగ్ టాలెంటెడ్ తో పాడించాలనుకున్నారు. ఫైనల్ గా ఈ సాంగ్ ను కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ తో పాడించాడు తమన్.

Raviteja_shruti_haasan_Krack_movie-zeecinemalu 5

ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి వర్క్ చేసిన ఈ సాంగ్ టీజర్ రేపు విడుదల కానుంది. అయితే తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది ? అనిరుద్ వాయిస్ ఎంత వరకూ ప్లస్ అవుతుంది ? అనే ప్రశ్నలకు రేపు సమాధానం దొరకనుంది.

Raviteja_shruti_haasan_Krack_movie-zeecinemalu 3

#BhalegaTagilaveyBangaram అనే లిరిక్ తో స్టార్ట్ అయ్యే ఈ సాంగ్ ను డిసెంబర్ 14న విడుదల చేయబోతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఠాగూర్ మధు నిర్మాత. రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Also Check – గోవాలో క్రాక్