మహేష్ సినిమాకు స్టార్ సినిమాటోగ్రాఫర్...

Tuesday,December 13,2016 - 02:30 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్.. మురుగుదాస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూటింగ్ ప్రెజెంట్ అహ్మదాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా తర్వాత మరోసారి కొరటాల శివ డైరెక్షన్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు మహేష్. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.

‘శ్రీమంతుడు’ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొంటున్నాయి. ఈ సినిమాకు స్టార్ కెమెరామెన్ రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ గా పని చేయనున్నారు .

ravi-k-chandran

   ఇప్పటికే మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో చాలా సినిమాలకు పనిచేసిన ఈ సినిమాటోగ్రాఫర్ లేటెస్ట్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ‘ఓకే జాను’ సినిమాకు పనిచేస్తున్నారు. మణిరత్నం ‘ఓకే కన్మణి’ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ అయి అందరినీ ఎట్రాక్ట్ చేసింది. ఈ టీజర్ లో తన సినిమాటోగ్రఫీతో అందరినీ మెస్మరైజ్ చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు రవి కె చంద్రన్. మరి ఈ స్టార్ సినిమాటోగ్రాఫర్ మహేష్ కొరటాల సినిమాకు పని చేయనుండడంతో ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ డెఫినెట్ గా హైలైట్ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.