రవిబాబు ‘అదుగో’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Friday,October 26,2018 - 11:07 by Z_CLU

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘అదుగో’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయింది. దీపావళి సందర్భంగా నవంబర్ 7 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. డిఫెరెంట్ సినిమాల దర్శకుడు రవిబాబు ఒక పందిపిల్ల చుట్టూ తిరిగే స్టోరీలైన్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం  ప్రీ రిలీజ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకునే  ప్రాసెస్ లో ఉంది. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాలో పూర్ణ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

ప్రశాంత్ విహారి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రవిబాబు నిర్మించిన ఈ సినిమా ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై తెరకెక్కింది. ఈ సినిమా మ్యాగ్జిమం అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుండటం విశేషం. సురేష్ బాబు ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు.