తండ్రితో కలిసి మరో సారి

Sunday,March 11,2018 - 10:00 by Z_CLU

ఇటివలే రాజా ది గ్రేట్ సినిమాలోమాస్ మహారాజ్ తనయుడు మహాధన్ చిన్నప్పటి రవి తేజ గా నటించిన సంగతి తెలిసిందే..  సినిమాలో మహాధన్ చేసింది చిన్న రోలే అయినప్పటికీ తన పెర్ఫార్మెన్స్ తో సినిమాపై మంచి ఇంపాక్ట్  తీసుకొచ్చాడు. ఇటివలే రవి తేజ కూడా మహాధన్ అంత బాగా   నటిస్తాడని అసలు ఊహించలేదు నాకంటే బాగా చేసాడు అంటూ కితాబిచ్చాడు కూడా. అదే ఉత్సాహంతో  ఇప్పుడు మరోసారి రవి తేజ సినిమాలో అలాంటి ఓరోల్ కనిపించానున్నాడట.

ప్రస్తుతం ‘నేల టికెట్’ సినిమాలో నటిస్తున్న రవి తేజ త్వరలో శ్రీను వైట్లతో అమర్ అక్బర్ అంటోని సినిమా చేయడానికి రెడీ అవ్తున్నాడు. ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలోనే  మహాధన్ మరో సారి కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమాలో అయినా తండ్రి కొడుకులు ఒకే ఫ్రేంలో కనిపిస్తారా…? లేదా చూడాలి.