Krack - రేపట్నుంచే లాస్ట్ షెడ్యూల్
Thursday,December 03,2020 - 02:50 by Z_CLU
Raviteja హీరోగా నటిస్తున్న సినిమా Krack. ఇప్పుడీ మూవీ ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటరైంది. టాకీ పార్ట్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క పాట షూట్ బ్యాలెన్స్ ఉంది.
గోవాలో రేపట్నుంచి క్రాక్ చివరి షెడ్యూల్ మొదలవుతుంది. ఇందులో రవితేజ, శ్రుతి హాసన్‌లపై సాంగ్ షూట్ చేస్తారు. రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూరుస్తున్న ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోంది ‘క్రాక్’. రీసెంట్ గా రవితేజ, అప్సరా రాణిపై షూట్ చేసిన “భూమ్ బద్దల్” అనే స్పెషల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. తమన్ సంగీత దర్శకుడు.
సంక్రాంతి కానుకగా ‘క్రాక్’ మూవీని రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు.