Khiladi - రవితేజ నుంచి మరో రిలీజ్

Sunday,January 31,2021 - 12:05 by Z_CLU

‘క్రాక్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, ‘రాక్ష‌సుడు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఖిలాడి’ మే 28న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రానికి స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌.

A-స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీకి ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

శ‌నివారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. మే 28న చిత్రం విడుద‌ల‌వుతోంద‌ని వెల్ల‌డిస్తూ రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో టాప్ టు బాట‌మ్ బ్లాక్ డ్ర‌స్‌లో, బ్లాక్ గాగుల్స్‌, బ్లాక్ షూస్‌తో, చేతిలో రివాల్వ‌ర్‌తో రోడ్డు మీద న‌డ‌చుకుంటూ వ‌స్తున్న ర‌వితేజ స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. ఆయ‌న చుట్టూ క‌రెన్సీ నోట్లు గాల్లో ఎగురుతూ ఉన్నాయి.

ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు. ఉన్న‌త స్థాయి టెక్నిక‌ల్ విలువ‌ల‌తో ర‌మేష్ వ‌ర్మ ‘ఖిలాడి’ని ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా తీర్చిదిద్దుతున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్ ఎస్సెట్ కానున్న‌ది.

RaviTeja-Khiladi-May-28-release-zeecinemalu

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్ వ‌ర్మ‌
నిర్మాత‌: స‌త్య‌నారాయ‌ణ కోనేరు
బ్యాన‌ర్లు: ఏ స్టూడియోస్‌, పెన్ స్టూడియోస్‌
ప్రొడ‌క్ష‌న్‌: హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌
స‌మ‌ర్ప‌ణ‌: డాక్ట‌ర్ జ‌యంతీలాల్ గ‌డ‌
మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ వాసుదేవ్‌
స్క్రిప్ట్ కో ఆర్డినేష‌న్‌: పా‌త్రికేయ‌
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్, అన్బు-అరివు
డైలాగ్స్‌: శ్రీ‌కాంత్ విస్సా, సాగ‌ర్‌
ఎడిటింగ్‌: అమ‌ర్ రెడ్డి
ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
పాట‌లు: శ్రీ‌మ‌ణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ముర‌ళీకృష్ణ కొడాలి
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.