ఆ హీరో కథతో రవితేజ

Thursday,January 19,2017 - 08:37 by Z_CLU

ఓ కథ ఓ హీరో నుంచి మరో హీరో కి షిఫ్ట్ అవ్వడం ఆ హీరో చేయలేకపోయిన కథ ను మరో హీరో టేక్ అప్ చెయ్యడం టాలీవుడ్ లో షరా మామూలే. అయితే ఇలాంటి స్టోరీ ఏ ఇప్పుడు రవి తేజ దగ్గరకి వచ్చింది. ఆల్మోస్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అయిన ఆ కథ మళ్ళీ యు టర్న్ తీసుకొని మాస్ మహారాజ్ చేతిలో పడింది.

ఇంతకీ ఆ కథేంటి? ఆ కథ తో సినిమా చేయాలనుకున్న హీరో ఎవరా? అనుకుంటున్నారా? ఆ కథ తో సెట్స్ పైకి వెళ్లాలన్న ఆ హీరో మరెవరో కాదు యంగ్ హీరో రామ్. ‘పటాస్’, ‘సుప్రీమ్’ లతో సూపర్ హిట్స్ అందుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రవి పూడి ఓ బ్లైండ్ కథ తో రామ్ తో సినిమా చేయాలనుకున్నాడు. ఈ కథ రామ్ కి బాగా నచ్చడం తో అనిల్ రవి పూడి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తన నెక్ట్స్ సినిమా ఇదే అంటూ అనౌన్స్ కూడా చేసేసాడు రామ్. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఈ సినిమా తన నెక్స్ట్ సినిమా కాదంటూ మళ్ళీ సోషల్ మీడియా ద్వారా చెప్పాడు రామ్.

ఇక ఇదే కథ తో ఎన్టీఆర్ అనిల్ రవి పూడి తో సినిమా చేయబోతున్నాడనే వార్త కూడా టాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. అయితే ఫైనల్ గా ఆ కథ తో అనిల్ రవి పూడి డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట రవి తేజ. ప్రెజెంట్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్న రవి తేజ ఈ కథ కి ఇంప్రెస్ అయ్యి లేటెస్ట్ గా అనిల్ రవి పూడి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం.