రవితేజ కూడా సెప్టెంబర్ లోనే

Thursday,June 08,2017 - 02:10 by Z_CLU

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బడా సినిమాలన్నీ సెప్టెంబర్ లో థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ బరిలో మహేష్ నటిస్తున్న ‘స్పైడర్’, ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ సినిమాలతో పాటు బాలయ్య-పూరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఉన్నాయి. ప్రెజెంట్ ఈ స్టార్ హీరోలతో పాటు రవితేజ కూడా తన లేటెస్ట్ మూవీ ‘టచ్ చేసి చూడు’ తో సెప్టెంబర్ లోనే థియేటర్స్ లోకి రావాలని చూస్తున్నాడట.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తుండగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ బ్యానర్ పై నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రవితేజ నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.