#Ramarao క్యాచీ టైటిల్ తో రవితేజ !

Monday,July 12,2021 - 12:48 by Z_CLU

 

శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్న రవితేజ. ఇటివలే ప్రీ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకొని సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్స్ తో సినిమాతో ఆసక్తి రేకెత్తించిన దర్శకుడు తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో రవితేజ లుక్ , టైటిల్ రివిల్ చేశాడు. రామారావు అనే క్యాచీ టైటిల్ పెట్టుకొని స్టైలిష్ లుక్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు రవితేజ.

సినిమాలో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడు. మాస్ మహారాజా ఎం ఆర్ ఓ క్యారెక్టర్ లో కనిపిస్తాడని టాక్ వినబడుతుంది. అయితే మేకర్స్ మాత్రం ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకుండా రవితేజ క్యారెక్టర్ కి సంబంధించి హింట్స్ ఇస్తూ వస్తున్నారు. మొన్న వదిలిన ప్రీ లుక్ పోస్టర్ లో రవితేజ రెండు చేతులతో సంతకాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిగా చూపించారు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో గవర్న్ మెంట్ వెహికల్ కపించేలా డిజైన్ చేశారు.

raviteja ramarao on duty movie 3

రామారావు తన ఉద్యోగం చేస్తూ ఎలాంటి వ్యక్తి అనిపించుకున్నాడు? రెగ్యులర్ సినిమాలో లాగే హీరోని భయపెట్టి ప్రభుత్వ ఆఫీస్ లో తమ పనులు చేయించుకునే విలన్స్ దానికి ఎదురుతిరిగే హీరో కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుండా ? లేదా కొత్త దర్శకుడు రవితేజ క్యారెక్టర్ ఇంకేదైనా కొత్తగా చూపిస్తాడా? అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు రవితేజ ఫ్యాన్స్. తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో క్యారెక్టర్స్ కి ప్రాణం పోసి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచే రవితేజ రామారావు పాత్రలో ఎలా మెప్పిస్తాడో ? చూడాలి. ఎస్ ఎల్ వి సినిమాస్ , RT టీం వర్క్స్ బేనర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకో హీరోయిన్ ఫైనల్ కావాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics