'విన్నర్' సాంగ్ ను రిలీజ్ చేసిన రవితేజ ....

Tuesday,February 14,2017 - 08:04 by Z_CLU

సాయి ధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో యాక్షన్ & రొమాంటిక్ ఎంటర్టైన్ గా తెరకెక్కుతున్న ‘విన్నర్’ సినిమాలో మరో సాంగ్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయగా రెండో సాంగ్ ను ఇటీవలే సమంత రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలోని ‘నా బి.సి సెంటర్ లు’ అనే 4 సాంగ్ ను మాస్ మహారాజ్ రవితేజ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు…

bc-centre-lu
సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ఇప్పుటికే 2 మిలియన్ వ్యూస్ సాధించి హల్చల్ చేస్తూ సినిమా పై భారీ అంచనాలు పెంచేసింది. ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల 19 న నిర్వహించి సినిమాను మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24 న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.