రవితేజ ఫిక్స్ అయ్యాడు....

Sunday,February 19,2017 - 01:25 by Z_CLU

లాస్ట్ ఇయర్ గ్యాప్ ను ఈ ఇయర్ 2 సినిమాలతో  ఫిల్ చేయడానికి డిసైడ్ అయిపోయాడు మాస్ మహారాజ్. ఇప్పటికే తన సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేసిన రవితేజ… వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలను థియేటర్లలోకి దింపాలని అనుకుంటున్నాడు.

ఇప్పటికే ‘టచ్ చేసి చూడు’ సినిమాను సెట్స్ పై పెట్టిన రవితేజ… మరోవైపు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందనున్న ‘రాజా ది గ్రేట్’ సినిమాను కూడా పట్టాలపైకి తీసుకురావాలని చూస్తున్నాడు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేసి లాస్ట్ ఇయర్ గ్యాప్ ను భర్తీ చేయాలని చూస్తున్నాడు.