రచయిత తో రవితేజ ?

Tuesday,July 19,2016 - 12:00 by Z_CLU

 

ఈ మధ్య రచయితలు దర్శకులుగా మారడం టాలీవుడ్ లో సర్వ సాధారణం అయిపోయింది. టాప్ డైరెక్టర్ కొరటాల కూడా ఈ కోవలోకే వస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ లో రచయితలకు భలే డిమాండ్ ఉంది. ఓ రెండు మూడు హిట్ సినిమాలకు రచయిత గా పని చేస్తే చాలు వెంటనే ఒకే అనేసి దర్శకుడిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు టాలీవుడ్ హీరోలు. అలా ఇప్పుడు ఓ రచయిత దర్శకుడిగా మారబోతున్నాడు. ఈ రచయిత ఎవరో ?కాదు ‘మిరపకాయ్’, ‘తడాఖా’, ‘రేసు గుర్రం’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన విక్రమ్ సిరి. ఇటీవలే ఈ రచయిత రవి తేజ కి ఓ కథ వినిపించారట. ఆ కథ కి బాగా నచ్చడం పైగా మూడు సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన అనుభవం కూడా ఉండడం తో వెంటనే ఈ యువ రచయిత కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట మాస్ మహారాజ్. ఇక ‘బెంగాల్ టైగర్’ తరువాత రవి తేజ ఓ రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాడని వినిపించిన అవి సెట్స్ పైకి వెళ్ళాక ముందే ఆగిపోయాయి. ఇక అన్ని కుదిరితే త్వరలోనే ఈ రచయిత తో సినిమాను సెట్స్ పైకి పెట్టేందుకు చూస్తున్నాడట ఈ ఎనర్జిటిక్ హీరో.