ముగ్గురిలో ఎవరు ముందు?

Wednesday,May 01,2019 - 10:02 by Z_CLU

మొదటి సినిమా హిట్టవ్వగానే రెండో సినిమాను జెట్ స్పీడ్ లో సెట్స్ పైకి తీసుకొచ్చేస్తున్నారు దర్శకులు. అయితే అజయ్ భూపతి మాత్రం దీనికి మినహాయింపు. ‘ఆర్ ఎక్స్ 100’తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన అజయ్, రెండో సినిమాపై మాత్రం  ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి బెల్లంకొండ శ్రీనివాస్ తో అజయ్ రెండో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ లేటవుతూ వస్తుంది. అందువల్లే ఈ దర్శకుడు, నాగచైతన్యకు షిఫ్ట్ అయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి.

అయితే ఇప్పుడీ  ఇద్దరు హీరోలతో పాటు అజయ్ భూపతి లిస్టులో రవితేజ పేరు కూడా వినిపిస్తోంది. మాస్ మహారాజ్ తో అజయ్ సినిమా చేస్తాడనే టాక్ ఉంది. రవితేజ కి అజయ్ స్టోరీ కూడా రెడీ చేసాడని సమాచారం. మరి ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఈ ముగ్గురిలో ఎవరితో రెండో సినిమా చేస్తాడో.. తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.