రవితేజ, కల్యాణ్ కృష్ణ సినిమా ప్రారంభం

Friday,January 05,2018 - 12:30 by Z_CLU

మాస్ రాజా రవితేజ కొత్త సినిమా స్టార్ట్ అయింది. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సైలెంట్ గా ఈ సినిమాను ఈరోజు స్టార్ట్ చేశారు. ముహూర్తం షాట్ తో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. హైదరాబాద్ లోని దర్గా రోడ్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. కల్యాణ్ కృష్ణ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు రామ్ తాళ్లూరి నిర్మాత.

 కంప్లీట్ మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాకు నేల టికెట్ అనే పేరు అనుకుంటున్నారు. మాళవిక శర్మను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఆమె ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఫిదాతో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిన శక్తికాంత్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

తొలిరోజు షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంగా అదిరిపోయే సెల్ఫీ రిలీజ్ చేశాడు రవితేజ. దర్శకుడు కల్యాణ్ కృష్ణ, కమెడియన్లు ప్రవీణ్, ప్రియదర్శి ఈ సెల్ఫీలో ఉన్నారు. ఏకథాటిగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి, సమ్మర్ తర్వాత మూవీని థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.