ప్రస్తుతం రవితేజ ఫోకస్ ఆ సినిమా మీదే....

Sunday,September 17,2017 - 10:06 by Z_CLU

ఏడాది గాప్ తీసుకున్న మాస్ మహారాజా రవి తేజ ఉన్నట్టుంది రెండు సినిమాలను సెట్స్ పెట్టిన సంగతి తెలిసిందే.. ఒకే సారి రెండు సినిమాలను ప్రారంభించడంతో ఈ రెండు సినిమాలతో కేవలం నెల గాప్ లోనే థియేటర్స్ లో రవి తేజ సందడి చేస్తాడనుకున్నారంతా. అయితే ప్రేక్షకుల ఊహాను ఇప్పుడు తారుమారు చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ప్రస్తుతం ‘రాజా ది గ్రేట్’ తో పాటు ‘టచ్ చేసి చూడు’ సినిమాలో నటిస్తున్న రవి తేజ ‘టచ్ చేసి చూడు’ సినిమాను పక్కన పెట్టి మరీ ‘రాజా ది గ్రేట్’ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాడు.

దీనికి రీజన్ గాప్ తర్వాత వస్తున్న సినిమా స్పెషల్ గా ఉండాలని, ఆడియన్స్ కు తనలోని మరో కొత్త కోణాన్ని చూపించాలనుకోవడమే.. ‘టచ్ చేసి చూడు’ కమర్షియల్ ఎంటర్టైనర్ కాబట్టి ఆ సినిమా ఎప్పుడొచ్చినా పరవాలేదని భావించిన రవి తేజ ‘రాజా ది గ్రేట్’ సినిమాలో అంధుడిగా ఓ కొత్త ప్రయోగం చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాతోనే ముందుగా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడట. అందుకే ఈ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసే ప్లాన్ లో ఉన్నాడు మాస్ మహారాజ్. అక్టోబర్ వరకూ ఈ సినిమాను పూర్తి చేసి నవంబర్ నుంచి మళ్ళీ ‘టచ్ చేసి చూడు’ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నాడట. సో ఒకే సారి రెండు సినిమాలు స్టార్ట్ చేసినప్పటికి రవి తేజ ముందు వచ్చేది మాత్రం ‘రాజా ది గ్రేట్’ తోనే అన్నమాట.