ఆ డైరెక్టర్ తో రవితేజ ఫిక్స్

Wednesday,June 07,2017 - 11:02 by Z_CLU

ప్రెజెంట్ 2 సినిమాలతో బిజీగా గడుపుతున్న మాస్ మహారాజ్ రవితేజ మరో సినిమా ఫైనలైజ్ చేసే ప్లాన్స్ లో ఉన్నాడు. విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో ‘టచ్ చేసి చూడు’ సినిమాతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కుతున్న’రాజా ది గ్రేట్’ సినిమాలో నటిస్తున్న రవితేజ ఈ రెండు సినిమాలు పూర్తవ్వగానే సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తాడట.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని, లేటెస్ట్ గా ‘కేశవ’ తో మరో సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మ, రవితేజ తో ఓ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నాడని, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుందని సమాచారం. త్వరలోనే ఈ కాంబోలో   సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నాడట రవితేజ. .