అనసూయ, అవును, అదుగో.. ఆవిరి

Tuesday,January 01,2019 - 04:19 by Z_CLU

ఈ లిస్ట్ చూస్తునే అర్థమైపోతుంది కదా. అవును.. రవిబాబు నెక్ట్స్ సినిమా పేరు ఆవిరి. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది.

నూతన సంవత్సర కానుకగా విభిన్న చిత్రాల దర్శకుడు-నటుడు రవిబాబు తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి ఆవిరి టైటిల్ కన్ఫర్మ్ చేశారు రవిబాబు. కొత్త సంవత్సరం కానుకగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఇది ఒక ఆఫ్ బీట్ చిత్రమని.. త్వరలోనే చిత్ర వివరాలను, నటీనటులను ప్రకటిస్తామంటున్నారు రవిబాబు. ఈ సినిమాకు నిర్మాత కూడా రవిబాబే.

డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేయడం రవిబాబు స్టయిల్. కెరీర్ స్టార్టింగ్ నుంచి అదే పద్ధతి ఫాలో అవుతున్నారు ఈ దర్శకుడు. ఆవిరి సినిమా కోసం కూడా అలాంటిదే ఓ వెరైటీ కాన్సెప్ట్ అనుకున్నారు ఈ డైరక్టర్. ఈ సినిమాలో మంచి గ్రాఫిక్స్ కూడా ఉంటాయట.