నవంబర్ 1న ర‌విబాబు `ఆవిరి` రిలీజ్

Monday,October 28,2019 - 01:22 by Z_CLU

`అల్ల‌రి`, `న‌చ్చావులే`, `అన‌సూయ‌`, `అవును`, `అవును 2` ..వంటి ప‌లు చిత్రాల ద్వారా త‌న‌దైన మార్కుతో ద‌ర్శ‌కుడిగా ర‌విబాబు త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `ఆవిరి`. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. నవంబర్ 1న థియేటర్లలోకి రానుంది.

ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ ప్ర‌ధాన పాత్రలు పోషించిన ఆవిరి చిత్రాన్ని.. నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ిస్తున్నాడు. ఎ ఫ్ల‌యింగ్ ఫ్రాగ్స్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై ర‌విబాబు దర్శ‌క నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కంప్లీట్ హారర్-థ్రిల్లర్ జానర్ లో ఉంటుంది.సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. త్వరలోనే ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు.


న‌టీన‌టులు:
ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ఆర్ట్‌: నారాయ‌ణ రెడ్డి
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
యాక్ష‌న్‌: స‌తీశ్‌
కెమెరా: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి
మ్యూజిక్: వైధి
స్క్రీన్‌ప్లే: స‌త్యానంద్‌
ర‌చ‌న‌, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: ర‌విబాబు