Ravanasura సెకండ్ సింగిల్ వస్తుంది

Monday,February 13,2023 - 04:25 by Z_CLU

Raviteja Ravanasura Second Single Pyaar Lona Paagal Lyrical On February 18th

వరుస బ్లాక్‌బస్టర్‌లతో ఫుల్ స్వింగ్‌లో వున్న మాస్ మహారాజా రవితేజ Ravi teja , క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రానికి నిర్మాతలు.

రవితేజ పుట్టినరోజున రావణాసుర Ravanasura డిఫరెంట్ షేడ్స్ చూపించే ఒక గ్లింప్స్ విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. ఇటీవల  హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన థీమ్ సాంగ్‌ను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్  ప్రమోషన్‌లను స్టార్ట్ చేశారు. ఎలక్ట్రిఫైయింగ్,  వైబ్రెంట్ ట్రాక్ మ్యూజిక్ చార్ట్‌లలో థీమ్ సాంగ్ అగ్రస్థానంలో నిలిచింది.

హర్షవర్ధన్ రామేశ్వర్‌తో పాటు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించారు. మేకర్స్ రెండవ సింగిల్ “ప్యార్ లోన పాగల్” లిరికల్ వీడియోను ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. షేడ్స్‌తో బ్లాక్ అవుట్ ఫిట్ ధరించిన రవితేజ పోస్టర్‌లో అల్ట్రా-స్టైలిష్‌గా కనిపిస్తు గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్ తో ఆకట్టుకున్నారు.

సుధీర్ వర్మ ఈ సినిమాలో రవితేజను లాయర్ పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా హై యాక్షన్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.

సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో  అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ.. కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.ఏప్రిల్ 7,2023న రావణాసురు గ్రాండ్‌గా విడుదల కానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics