రష్మిక కూడా మొదలుపెట్టింది!

Saturday,April 18,2020 - 01:17 by Z_CLU

సుకుమార్ డైరెక్షన్ లో తన 20వ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇటీవలే కేరళలో ఒక షెడ్యుల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు. అందుకోసం స్పెషల్ గా ఆ స్లాంగ్ నేర్చుకుంటున్నాడు బన్నీ. ఓ వైపు లుక్ పై శ్రద్ధ పెడుతూనే చిత్తూరు యాసపై పట్టు సాదించే పనిలో ఉన్నాడు.

ఇక లాక్ డౌన్ నేపథ్యంలో రష్మిక కూడా బన్నీను ఫాలో అవుతూ చిత్తూరు యాస నేర్చుకుంటోందట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గంటల తరబడి ఈ యాసతో కూడిన డైలాగ్స్ ను ప్రాక్టీస్ చేస్తుందని సమాచారం. మరి బన్నీ-రష్మిక చిత్తూరుయాసలో మాట్లాడి ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి..

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూట్ త్వరలోనే తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో ప్రారంభమౌతంది.