Rashmika Vijay Deverakonda - ఆ మేటర్ విజయ్ నే అడగమంటున్న రష్మిక

Tuesday,April 27,2021 - 05:52 by Z_CLU

రష్మిక, విజయ్ దేవరకొండది క్రేజీ కాంబినేషన్. ఇద్దరూ కలిసి నటించిన గీతగోవిందం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చేసిన డియర్ కామ్రేడ్ పెద్దగా వర్కవుట్ అవ్వనప్పటికీ, వీళ్లిద్దరి కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.

vijay-devarakonda-rashmika-zeecinemalu

రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తే చూడాలని కోరుకునే తెలుగు ఆడియన్స్ చాలామంది ఉన్నారు. రీసెంట్ గా లైవ్ ఛాట్ లోకి వచ్చిన రష్మికకు కూడా ఈ క్వశ్చన్ ఎదురైంది. ఆ ప్రశ్నకు తనదైన స్టయిల్ లో సమాధానం ఇచ్చింది రష్మిక.

vijay-devarakonda-rashmika-zeecinemalu

విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయాలని తనకు కూడా ఉందని.. కాకపోతే మంచి స్క్రిప్ట్ పడాలని, తనే కావాలని విజయ్ దేవరకొండ అనుకోవాలని.. అప్పుడు మాత్రమే తమ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని చెప్పుకొచ్చింది. ఇకపై ఎప్పుడైనా ఈ ప్రశ్న తనను కాకుండా, విజయ్ దేవరకొండనే అడగమని నెటిజన్లకు చెప్పేసింది ఈ కన్నడ కస్తూరి.

vijay-devarakonda-rashmika-zeecinemalu

కేవలం ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా ఇద్దరికీ మంచి కెమిస్ట్రీ ఉంది. రియల్ లైఫ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక బెస్ట్ ఫ్రెండ్స్. మొన్నటికిమొన్న తల్లి పుట్టినరోజును సెలబ్రేట్ చేసిన విజయ్, ఆ బర్త్ డే పార్టీకి రష్మికను మాత్రమే ఆహ్వానించాడు. రీసెంట్ గా ముంబయిలో ఇద్దరూ కలిసి డిన్నర్ కు కూడా వెళ్లారు. ఇలా టైమ్ దొరికినప్పుడల్లా ఈ ఫ్రెండ్స్ కలుస్తూనే ఉంటారు.

vijay-devarakonda-rashmika-zeecinemaluvijay-devarakonda-rashmika-zeecinemalu

సిల్వర్ స్క్రీన్ పై ఈ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందనేది ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతిలోనే ఉంది. అన్నట్టు వీళ్లిద్దరూ కలిసి రీసెంట్ గా  ఓ యాడ్ కూడా చేశారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics