మొన్న కైరా.. ఈరోజు రష్మిక.. రోజుకో గాసిప్

Tuesday,January 08,2019 - 12:18 by Z_CLU

బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో సినిమా ప్రకటించినప్పట్నుంచి ఇలా రోజుకో గాసిప్ బయటకొస్తూనే ఉంది. ఈ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన మరుసటి రోజే కైరా అద్వానీని ఇందులో హీరోయిన్ గా తీసుకోబోతున్నారంటూ రూమర్ మొదలైంది. ఇప్పుడు రష్మిక రూపంలో మరో గాసిప్ మొదలైంది.

బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో రష్మికను హీరోయిన్ గా తీసుకోబోతున్నారనేది లేటెస్ట్ రూమర్. ప్రస్తుతం ఈ గీతగోవిందం బ్యూటీతో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోందంటూ సోషల్ మీడియా ఊదరగొట్టేస్తోంది. ఇది ఎంత వరకు నిజమో తేలాలంటే బన్నీ లేదా త్రివిక్రమ్ రియాక్ట్ అవ్వాల్సిందే.

ప్రస్తుతానికైతే బన్నీ మేకోవర్ పనిలో బిజీగా ఉన్నాడు. ఈనెలలోనే సెట్స్ పైకి రాబోతున్న సినిమా కోసం ఓ న్యూలుక్ ట్రై చేసే పనిలో బన్నీ ఉన్నాడు. అటు త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో బిజీ. మరోవైపు నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబు.. ప్రొడక్షన్ వ్యవహారాలతో బిజీ. సో.. హీరోయిన్ పై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.