రష్మిక మండన్న – ఇప్పటి నుండి కొత్త లెక్క

Monday,April 08,2019 - 04:03 by Z_CLU

రష్మిక మండన్న రేంజ్ మారిపోనుంది. నిన్నా మొన్నటి వరకు వరస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరోయిన్ అనిపించుకుంటున్న రష్మిక,  బన్ని సినిమాలో చాన్స్ కొట్టేసి సక్సెస్ ఫుల్ గా మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టేసింది. అందుకే  రష్మిక విషయంలో ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పటి నుండి ఓ లెక్క.

అపుడెపుడో ‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్ని రష్మిక గురించి మాట్లాడినప్పుడే ఆల్మోస్ట్ ఇంప్రెస్ చేసేసిందనిపించింది. తీరా చూస్తే త్రివిక్రమ్, బన్ని సినిమాలో రష్మిక కన్ఫమ్ అయిందనే న్యూస్ బయటికి వచ్చేసరికి, ఫ్యాన్స్  లో మరిన్ని వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.

‘ఛలో’ తో ఫస్ట్ ఇంప్రెషన్… బెస్ట్ ఇంప్రెషన్ అనిపించుకుంటే, ఆ తరవాత ‘గీత గోవిందం’ తో ఉండాల్సిన అమ్మాయే అనిపించుకుంది. అదే వరసలో రిలీజైన ‘దేవదాస్’ తో C/o టాలీవుడ్ అనిపించుకుంది. అయితే ఇప్పుడు బన్ని సినిమాతో రష్మిక లోని మరో యాంగిల్ బయటపడనుంది. ఇప్పటి వరకు పక్కా పక్కింటి అమ్మాయి టైప్ తరహాలో కనిపించిన రష్మిక, ఈ సినిమాతో తనలోని మాస్ ఆంగిల్ ని ప్రెజెంట్ చేయనుంది.

ఏది ఏమైనా ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న రష్మిక బన్ని సినిమాతో పక్కా కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోనుంది. ఇప్పటి వరకు ఒక్క టాప్ స్టార్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకోని రష్మిక, ఈ సినిమా తర్వాత వరసగా టాప్ స్టార్స్ సరసన కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.