రష్మిక మందన్న ఇంటర్వ్యూ

Tuesday,July 23,2019 - 03:40 by Z_CLU

‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ‘రష్మిక మందన్న’ చక చకా సినిమాలు చేస్తూ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ తో లిల్లి గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయింది. ఈ సినిమా ఈ నెల 26న థియేటర్స్ లోకి రాబోతున్న సందర్భంగా రష్మిక మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఈ ముద్దుగుమ్మ మాటల్లోనే !

 

చాలా కష్టపడ్డాను

‘డియర్ కామ్రేడ్’ నాకు స్పెషల్ మూవీ. సినిమాలో లిల్లి అనే క్యారెక్టర్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఈ క్యారెక్టర్ కోసం స్పెషల్ గా కొన్ని నెలల పాటు క్రికెట్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. చాలా కష్టపడి నేర్చుకున్నప్పటికీ సినిమాలో క్రికెట్ కి సంబంధించి కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉంటాయి. కంప్లీట్ గా క్రికెట్ బ్యాక్ డ్రాప్ మూవీ కాదు. కానీ నేను స్టేట్ ప్లేయర్ క్రికెటర్ గా కనిపిస్తాను. అందుకే క్రికెట్ ఆడే సన్నివేశాల్లో దర్శకుడి మాట మేరకూ పర్ఫెక్షన్ కోసమే ఎక్కువ రోజులు ట్రైనింగ్ తీసుకున్నాను.

రెస్పెక్ట్ పెరిగింది.

నిజానికి సినిమాలో క్యారెక్టర్ కోసం క్రికెట్ నేర్చుకున్నాను కానీ నిజ జీవితం క్రికెట్ నా గేమ్ కాదు. స్విమ్మింగ్ , బాస్కెట్ బాల్ లాంటి గేమ్స్ ఆడేదాన్ని కానీ క్రికెట్ కి మాత్రం కొంచెం దూరంగానే ఉండేదాన్ని. ఇప్పుడు సినిమా కోసం నేర్చుక తప్పలేదు. ఇప్పుడు క్రికెట్ ఆడితే నా వికెట్స్ ఎలా కాపాడుకోవాలో మాత్రం తెలిసిపోయింది. ఫైనల్ గా ఈ సినిమా తర్వాత నాకు క్రికెట్ మీద రెస్పెక్ట్ పెరిగింది.

ఇంట్రెస్టింగ్

భరత్ గారు సినిమా కథను నెరేట్ చేయలేదు. స్టోరీ మొత్తం నాకు చదవమని పంపించారు. ఒక గంట చదివాక ఆసక్తిగా అనిపించింది. నెక్స్ట్ ఏం జరుగబోతుంది అనే క్యూరియాసిటీ కలిగింది. సో వెంటనే సినిమా చేయాలని ఫిక్సయ్యాను.

మంచి కథ దొరికితే.. మళ్ళీ

విజయ్ నేను కలిసి రెండు సినిమాలు చేసాం. వెంటనే ఇంకో సినిమా చేయదలుచుకోలేదు. ఒక రెండు మూడేళ్ళు అయ్యాక ప్రేక్షకులు మా పెయిర్ ని మిస్
అయితే అప్పుడు మంచి కథ దొరికితే చేస్తాం. అంతే (నవ్వుతూ)

రెండు భాషల్లో

ఈ సినిమాకు సంబంధించి తెలుగు, కన్నడ భాషల్లో డబ్బింగ్ చెప్పాను. నిజానికి మనం నటించిన సన్నివేశాలకు మనమే డబ్బింగ్ చెప్తే ఆ వాయిస్ లో ఫీల్ ఉంటుందని నా నమ్మకం. అప్పుడే క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుంది. అందుకే తెలుగులో కూడా నేనే అడిగి మరీ డబ్బింగ్ చెప్పుకున్నాను.

ఎగ్జైటింగ్ గా ఉంది

ఈ సినిమా కన్నడలో అదే రోజు రిలీజ్ అవుతుండడం ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ సినిమా అక్కడ కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఎక్కడైనా కథ అదే కాబట్టి డెఫినెట్ గా మిగతా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.

కథకే ప్రాధాన్యం

హీరో ఎవరైనా, దర్శకుడు కొత్తైనా నా మొదటి ప్రాధాన్యం మాత్రం కథకే. కథ నచ్చితే ఏ భాషలో అయినా సినిమా చేస్తాను. కథ తర్వాత నా క్యారెక్టర్ గురించి ఆలోచిస్తాను.

నాలుగు సినిమాలు చేయొచ్చు

సరిగ్గా ప్లాన్ చేసుకుంటే హీరోయిన్ గా ఏడాదికి నాలుగు సినిమాలు చేయొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో షూట్ డీలే అవ్వడం , నిర్మాణంలో ఏదైనా ఇబ్బందులు వస్తే చెప్పలేం. అది నా చేతుల్లో ఉండదు కాబట్టి ఏం చేయలేను. ప్రస్తుతం తెలుగులో ‘భీష్మ’ , కన్నడలో ఒక సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లో జాయిన్ అవుతాను.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా

మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఫీలవుతున్నా. ఆయనని ఒకసారి కలిసాను. చాలా హంబుల్ పర్సన్. ఆయనతో ఎప్పుడెప్పుడు నటిస్తానా అని ఉంది. సినిమాలో నటిస్తూ ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకోవాలి.

అంత ఈజీ కాదు

ఒక యాక్టర్ నటిస్తుంటే చూసే వారికీ ఇది చాలా సులువే అనిపిస్తుంది. కానీ యాక్టింగ్ అంత ఈజీ కాదు. ఏ స్విచువేషన్ కి తగినట్టుగా రియాక్ట్ అవుతూ నటించడం సులువేం కాదు. అది చాలా మందికి తెలియదు. నటిగా ఇప్పుడిప్పుడే చాలా విషయాలు నేర్చుకుంటున్నాను.


నాది లాక్ కాదు

నిజానికి రష్మిక హిట్స్ వెనుక లక్ ఉంది అనుకుంటారు. కానీ లక్ వెనుక చాలా హార్డ్ వర్క్ ఉంది. వచ్చిన ప్రతీ క్యారెక్టర్ ని ఓన్ చేసుకుంటూ నేచురల్ గానే నటించడానికి ప్రయత్నిస్తుంటాను. అందువల్లే నేను చేసిన ప్రతీ సినిమాలో నాకు హీరోయిన్ గా మంచి పేరొచ్చింది. అందరికీ బాగా కనెక్ట్ అయ్యాను. కేవలం లక్ మాత్రమే నమ్ముకొని నటనలో విషయం లేకపోతే కొంతకాలమే సినిమాలు చేయగలం.

 

నేను సింగిల్

ఒక యాక్టర్ ని అందరూ ఎక్కువగా అడిగే ప్రశ్న మీరు సింగిల్ ఆ ? లేదా ఎవరితో అయినా రిలేషన్ షిప్ లో ఉన్నారా..? ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారో అర్థం కాదు. లైఫ్ ఎంజాయ్ చేస్తూ , సినిమాలు చేసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఎస్ నేను సింగిల్(నవ్వుతూ)

చిల్ ఫెలో

‘భీష్మ’ కి పనిచేసే వాళ్ళల్లో కొందరు తెలుసు. గతంలో వాళ్ళతో ఛలో చేశాను. నితిన్ తో ఇదే మొదటి సారి ఎలా ఉంటాడో.. అనుకునేదాన్ని కానీ నితిన్ చిల్ ఫెలో. సరదాగా మాట్లాడుతూ కూల్ గా ఉంటాడు.

తమిళ్ ఒకటి… తెలుగులో ఒకటి

లేటెస్ట్ గా తమిళ్ లో కార్తి సినిమాకు సైన్ చేసాను. తెలుగులో అల్లు అర్జున్ , సుకుమార్ గారి సినిమాకు సైన్ చేసాను. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా..? అని వెయిటింగ్.