Pushpa Movie - రష్మిక ఫస్ట్ లుక్

Wednesday,September 29,2021 - 02:07 by Z_CLU

అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది.

ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.

rashmika pushpa movie

తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రీవల్లి పాత్రలో ఇందులో నటిస్తోంది రష్మిక. పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్న ఆమె పాత్ర, సినిమాకు హైలెట్ అవుతుందంటున్నారు మేకర్స్. చెవుల కమ్మలు పెట్టుకుంటూ ఉన్న ఆమె లుక్ ఆకట్టుకుంటుంది.

క్రిస్మస్ సందర్భంగా పుష్ప: ది రైజ్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటులు: 

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు

– – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics