ఇటు బన్నీ ..అటు తారక్!

Tuesday,March 31,2020 - 12:05 by Z_CLU

సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ సరసన హీరోయిన్ గా నటించనుంది రష్మిక. ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ టైంలోనే రష్మికను హీరోయిన్ గా లాక్ చేసుకున్నారు మేకర్స్.

ఈ సినిమా కోసం ఇప్పటికే బల్క్ డేట్స్ కేటాయించడానికి రెడీ అవుతున్న ఈ బ్యూటీ తాజాగా మరో భారీ సినిమా కూడా కన్ఫర్మ్ చేసుకుందట. అవును.. ఇటు అల్లు అర్జున్ తో సినిమా చేస్తూనే అటు తారక్ తో కూడా నటించనుందట రష్మిక.

త్రివిక్రమ్ -తారక్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఆల్ మోస్ట్ ఫిక్స్ అంటున్నారు. ఆ సినిమాకు సంబంధించి రష్మికకు అడ్వాన్స్ కూడా అందిందని టాక్. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే నెక్స్ట్ సినిమాల గురించి ఆలోచిస్తుందట.

తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది రష్మిక.