నితిన్ సరసన గీతగోవిందం బ్యూటీ

Saturday,September 15,2018 - 01:17 by Z_CLU

తన సినిమాల్లో ఏది ఉన్నా లేకపోయినా క్రేజీ హీరోయిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు నితిన్. ఇదిప్పుడు కాదు, కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న సూత్రం. ఇప్పుడు తన కొత్త సినిమాకు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. తన అప్ కమింగ్ మూవీ కోసం రష్మికను హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నాడు.

గీతగోవిందంతో స్టార్ అయిపోయింది రష్మిక. ఇప్పుడీ బ్యూటీ నితిన్ సరసన నటించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ చేస్తున్న భీష్మ అనే సినిమాలో ఈమె హీరోయిన్. ఇక్కడ మరో యాంగిల్ కూడా ఉంది. ఇదే వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది రష్మిక. ఈ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఇది కూడా ఓ కారణం.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తోంది భీష్మ సినిమా. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఇది రాబోతోంది.