#Rashmika - లేడీ ఓరియంటెడ్ కి గ్రీన్ సిగ్నల్?

Saturday,September 11,2021 - 07:08 by Z_CLU

ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది కన్నడ బ్యూటీ రష్మిక. తాజాగా ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అవును హీరోగా కొన్ని సినిమాలు చేసి ‘చిలసౌ’తో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఇటివలే ఓ స్క్రిప్ట్ రాసుకొని రష్మిక కి వినిపించాడని తెలుస్తుంది. మొదటి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న రాహుల్ రవీంద్రన్ రెండో సినిమా ‘మన్మథుడు 2’ తో డిజాస్టర్ అందుకొని దర్శకుడిగా గ్యాప్ తీసుకున్నాడు. ఆ సినిమా అపజయం నుండి బయటికొచ్చి ఇప్పుడు ఓ థ్రిల్లర్ సినిమా ప్లాన్ చేసుకున్నాడట.

rashmika new stills zeecinemalu

థ్రిల్లర్ జోనర్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కించనున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ లాక్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేసాడట. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ ‘పుష్ప’, శర్వానంద్ ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలతో పాటు బాలీవుడ్ లో ఓ బిగ్ ఫిలిం చేస్తుంది. ఆ సినిమాల తర్వాత రష్మిక రాహుల్ రవీంద్రన్ సినిమాకు డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది.

rashmika new stills zeecinemalu

చిలసౌ రిలీజ్ కి ముందే తన దగ్గర మరోమూడు నాలుగు కథలున్నాయని రాహుల్ చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు తీయబోయే మూడో సినిమా కథ అందులో ఒకటి అయి ఉండొచ్చు. గతంలో తనకి థ్రిల్లర్ జోనర్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు కూడా. అందుకే ఎట్టకేలకు తనకి నచ్చిన జానర్ లో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బేనర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics