'ఆచార్య'.. చరణ్ తో ఆ హీరోయిన్?

Friday,May 01,2020 - 01:17 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ ‘ఆచార్య’ లో రామ్ చరణ్ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఓ సందర్భంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది.

అయితే చరణ్ ఎపిసోడ్ లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఓ డ్యూయెట్ సాంగ్ కూడా ఉంటుందట. అందుకే సినిమాలో చరణ్ కోసం హీరోయిన్ ని కన్ఫర్మ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

ఇప్పటికే పూజా హెగ్డే తో పాటు మరికొందర్ని సంప్రదించి ఫైనల్ గా రష్మిక ను తీసుకున్నారని టాక్. లేటెస్ట్ గా రష్మికకి కొరటాల స్టోరీ వినిపించి ఆమెతో ఓకే చేయించుకున్నాడని టాక్. త్వరలో తెరకెక్కే ఓ భారీ షెడ్యుల్ లో రామ్ చరణ్, రష్మిక సన్నివేశాలతో పాటు సాంగ్ కూడా తీస్తారట.

మరి మేకర్స్ నుండి ఈ విషయం అఫీషియల్ గా బయటికొచ్చేదెప్పుడో చూడాలి.